జగన్ యాత్రల్లో నిజమెంత ? అసలు ఆయన ప్రజల్లోకి వస్తున్న ఉద్దేశం ఏంటి ? ఓటమి వాసన పోకుండానే యుద్దానికి దిగేంత సత్తా నిజంగానే ఉందా ? అసలు నాయకులే పారిపోతే మరి ఎవరు ఇవ్వన్నీ చూస్తున్నారు.
జగన్ రెడ్డి చేస్తున్న యాత్రల్లో ఉన్న నిజం ఏంటో డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్దాం. అక్కడికి జనాలు వస్తున్నారా తరలిస్తున్నారా అంటే అది మీ ఊహకే వదిలేస్తున్న. 11సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని పులి మొన్నటివరకు అధికారం ఉన్నా ప్రజల్లోకి పరదాలు లేకుండా తిరగలేకపోయిన పులిబిడ్డ ఈరోజు రాష్ట్రమంతా తనకోసం ఎదురు చూస్తుంది అన్నట్టు ప్రతి చిన్నదానికి ఏదో ఒక కార్యక్రమం క్రియేట్ చేసి జనాల్లోకి వెళ్లాలని ఎవడో ఇచ్చిన సచ్చు సలహాలు పట్టుకుని కక్కుర్తి ప్రచార పిచ్చలో పడి వారు బాదితులా లేక సమస్యకు కారకులా అనికూడా చూసుకోకుండా మొన్న గంజాయి బ్యాచ్ ని పరామర్శించి రాష్ట్రం మొత్తం బిడ్డని చూసి నవ్వేలా చేసుకున్నాడు. కానీ సొంత మీడియా సాక్షిలో మాత్రం ఎప్పటి లాగానే ఉప్మాకి బిర్యానీ మసాలాలు జోడించి పడిపోయిన పులిబిడ్డ గ్రాఫ్ ని జాకీలు వేసి మరీ లేపుతున్నారు వారి పెరట్లో మీడియా.
అసలు ప్రభుత్వం గురించి ఏమైనా సలహాలు లేదా ఏదైనా మాట్లాడాలంటే రాజ్యాంగ బద్దంగా అసెంబ్లీ కి వచ్చి పులి దాని గర్జనను వినిపించొచ్చు, కానీ ఇక్కడ అంతా రివర్స్ అసెంబ్లీ లో స్పీకర్, అచ్చన్నాయిడు, ఆర్ ఆర్ ఆర్ సహా చాలామంది పులి బిడ్డ అసెంబ్లీ వస్తే చూడాలని వేయి కళ్ళతో చూస్తున్నారు. కానీ వారి కోరిక తీరేలా లేదు, జనాలకి మళ్ళీ ఎంగిలి ముద్దులు తప్పేలా లేవు, సారూ ఊపు చూస్తుంటే త్వరలో ఏదో ఒక పనికిమాలిన యాత్ర మొదలు పెట్టి సినిమా స్టంట్ లు షురు చేసేలా ఉన్నాడు. తాడేపల్లి వైపుగా వచ్చిన గాలుల్లో వినపడ్డ సమాచారం ఏంటంటే ఇప్పుడు చేస్తున్న పరామర్శ లాంటి యాత్రలన్నీ దానికి రిహార్సలే అంటున్నారు. పాపం బిడ్డడు చాలా రోజులు అయ్యింది కదా జనాల్ని చూసి,సడన్ గా జనాల్లోకి వెళ్తే అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన వాడు ఎవరైనా వారి బావప్రకటన స్వేచ్ఛను వాడుకుంటే ఏంటి అనే కోణం లో కూడా ఆలోచిస్తున్నారట. మొన్నక తెలుగుదేశం నాయకుడు జగన్ అసెంబ్లీ కి రావాలి మాకు ఇచ్చినవి అన్నీ తిరిగి ఇచ్చేస్తాం లేకుంటే లావు అయిపోతాం అని ఆయనకు పులిబిడ్డ పై ఉన్న ప్రేమను చాటుకున్నారు.
ఇక అప్పుడెప్పుడో తెచ్చుకుని పులిబిడ్డ ని లేపడానికి పెట్టుకున్న కంపెనీ తో కాంట్రాక్టు అయిపోయినా డబ్బుకి రుచిమరిగి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సలహాలు ఇచ్చిన ఉత్తుత్తి కన్సల్టెంట్ లు ఇక్కడే పాతుకుపోయి ప్రజల్లో డబ్బు ఆశ చూపించి చేస్తున్న స్టార్ట్ కెమెరా యాక్షన్ స్టంట్ లే ఈ యాత్రలు. వారికి జీతం పడాలి అంటే ఇలాంటి పనులు చేస్తూనే ఉండాలి, సాక్షి మీడియా కి కంటెంట్ కావాలంటే ఇలాంటివి జరుగుతూనే ఉండాలి. ఎలాగు పెరట్లో మీడియా కి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడేంత జర్నలిజం విలువలు లేవు కాబట్టి ఇలాంటి సచ్చు యాత్రలతో లాగించేయడమే. జగన్ యాత్రలు నిజానికి దూరం, మరో ముద్దుల యాత్రలకి ఇదొక రిహార్సల్, కార్యకర్తలు జారిపోకుండా వాపును బలుపులా చూపించే ప్రయత్నం.