ఆడబిడ్డ నిధి గురించి చెప్తూ, హెవీ బడ్జెట్ కాబట్టి, ఎంత అవుతుందో చెప్పటానికి, ఆయన అలా చెప్పారు. ఎంత పెద్ద బడ్జెట్ అయినా, ఎలాగైనా పధకం అమలు చేసి తీరుతాం అని చెప్పారు. ఇంత స్పష్టంగా చెప్పిన మాటలను కూడా వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది.. గతంలో కూడా ఇలా ఫేక్ చేయటం వైసీపీకి అలవాటు.. ఎలా ఫేక్ చేసే వాళ్ళో చూడండి
పెన్షన్ పెంపు :
వైసీపీ ఫేక్ : పెన్షన్ పెంచి ఇస్తాం అన్నారు, పెంచలేదు
చంద్రబాబు పధకం ఇచ్చాక : రెండో తారీఖు లోపు పెన్షన్ తీసుకోకపోతే, పెన్షన్ పోతుంది
తల్లికి వందనం :
వైసీపీ ఫేక్ : తల్లికి వందనం ఇవ్వలేను అని చెప్పిన చంద్రబాబు
చంద్రబాబు పధకం ఇచ్చాక : మోసం చేసారు, అందరికీ ఇవ్వలేదు అంటూ దొంగ ఏడుపులు
గ్యాస్ ఫ్రీ :
వైసీపీ ఫేక్ : ఉచిత గ్యాస్ ఇవ్వలేను అని చెప్పిన చంద్రబాబు
చంద్రబాబు పధకం ఇచ్చాక : రాష్ట్రంలో అన్ని కుటుంబాలకి గ్యాస్ ఇచ్చేయాలి అంట. ఉన్నత వర్గాలకు కూడా
మత్స్యకారుల వేట నిషేధ బృతి :
వైసీపీ ఫేక్ : మత్స్యకారుల వేట నిషేధ బృతి ఎగ్గొట్టారు
చంద్రబాబు పధకం ఇచ్చాక : ఈ ఏడాది ఇచ్చారు కానీ, పోయిన ఏడాది ఇవ్వటం మర్చిపోయారు అంటూ బుకాయింపు
చెత్త పన్ను రద్దు :
వైసీపీ ఫేక్ : చెత్త పన్ను రద్దు చేయకుండా, పెంచారు
చంద్రబాబు పధకం ఇచ్చాక : చెత్త పన్ను రద్దు చేసారు కానీ, చెత్త ఎత్తటం లేదు
ఫ్రీ బస్సు లేదు :
వైసీపీ ఫేక్ : చంద్రబాబు ఫ్రీ బస్సు ఇవ్వను అన్నారు
ఆగస్టు 15 నుంచి ఇస్తామని చంద్రబాబు చెప్పాక : జిల్లా పరిధి కాదు, రాష్ట్రం మొత్తం పెట్టాలి (హామీ ఇచ్చింది జిల్లా పరిధికే)
తానే పెంచిన విద్యుత్ చార్జీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తగ్గించాలని ధర్నా చేస్తాడు..
తానే బకాయిలు పెట్టిన వెళ్ళిన ఫీజు రీయింబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం తగ్గించాలని ధర్నా చేస్తాడు..
మొత్తం మోసం, దగా.. ఇది జగన్ విధానం… చేయలేదు అంటాడు.. చేస్తుంటే, కోడిగుడ్డు మీద ఈకలు పీకుతాడు..
ఇప్పుడు ఆడబిడ్డ నిధి కూడా అంతే.. అచ్చెన్న చెప్పింది కేవలం బడ్జెట్ ఎక్కువ అని.. ఎక్కడా మేము పధకం ఇవ్వం అని చెప్పలేదు